డాక్టర్ మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా టైటిల్ పోస్టర్ విడుదల
- August 15, 2020
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్‌బాబు కొత్త సినిమాలు ఒప్పుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నటునిగా తనను ఉత్తేజపరిచే సినిమాలనే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 560కి పైగా చిత్రాలలో నటించిన ఈ లెజెండరీ యాక్టర్ కోసం స్క్రిప్టులు రాయడం అనేది అనేకమంది దర్శకులకు ఓ ఛాలెంజ్.
లేటెస్ట్‌గా డాక్టర్ మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమా చేయడానికి అంగీకరించారు. ఇందులో ఆయన కథానాయకునిగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాపులర్ స్క్రిప్ట్/ డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 శనివారం 'సన్ ఆఫ్ ఇండియా' టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో తీక్షణంగా చూస్తున్న మోహన్‌బాబు కనిపిస్తున్నారు. 'సన్ ఆఫ్ ఇండియా' టైటిల్‌ను ఆకర్షణీయంగా, దేశభక్తి ఉట్టిపడేలా డిజైన్ చేశారు.
ఇంతవరకు తెలుగుతెరపై కనిపించని కథాంశాన్నీ, జానర్‌నీ ఈ సినిమాలో చూడబోతున్నాం. అలాగే ఇదివరకెన్నడూ మనం చూడని పవర్‌ఫుల్ రోల్‌ను మోహన్‌బాబు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు పనిచేస్తున్న తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







