దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
- August 15, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు భారత కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి జాతీయ జెండాను ఎగురవేశారు. మహమ్మారి కోవిడ్ నేపథ్యంలో ఈసారి ఈ కార్యక్రమానికి పబ్లిక్‌ను అనుమతించలేదు. కేవలం కార్యాలయం సిబ్బంది, అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో దుబాయ్ లోని భారత ప్రవాసులు ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా అధికారిక సోషల్ మీడియా లో ప్రవాసుల కోసం ఈ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ కి చెందిన ప్రముఖ గాయకుడు సూరజ్ భారతి దేశభక్తి గీతం పాడగా, ఒక నృత్య బృందం వేదిక వద్ద శాస్త్రీయ నృత్యాలు చేసింది.
అనంతరం కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి ఈ సభలో ప్రసంగించారు. భారతీయ సమాజంలోని సభ్యులు, మా ఎమిరాటి స్నేహితులు,దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







