ఆకట్టుకుంటోన్న యాక్షన్ హీరో విశాల్ `చక్ర` ట్రైలర్ ఒరిజనల్ సౌండ్ ట్రాక్
- August 15, 2020
యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ `చక్ర`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర ఒక కీలకపాత్రలో నటిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్నఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకోగా ఇటీవల విడుదలైన ట్రైలర్ పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలను పెంచింది. కాగా ఇండిపెండెన్స్ డే కానుకగా యువన్ శంకర్‌రాజా సంగీత సారథ్యంలోని`చక్ర` ట్రైలర్ ఒరిజనల్ సౌండ్ ట్రాక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సౌండ్ ట్రాక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్ నేపథ్యంలో సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.
యాక్షన్ హీరో విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి : బాలసుబ్రమనియం, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: విశాల్,రచన- దర్శకత్వం: ఎం.ఎస్ ఆనందన్.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?