ఖతార్ : స్కూల్స్ నిర్వహణపై సెప్టెంబర్ 1న స్పష్టమైన ప్రకటన

- August 17, 2020 , by Maagulf
ఖతార్ : స్కూల్స్ నిర్వహణపై సెప్టెంబర్ 1న స్పష్టమైన ప్రకటన

కరోనా నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంపై ఖతార్ లో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. తరగతుల నిర్వహణపై ఎలాంటి ప్రణాళిక ఆచరణలోకి తీసుకురావాలనేది విద్యాశాఖ, వైద్యశాఖ సంయుక్తంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ షేక్ మొహమ్మద్ అల్ తని ఖతార్ రేడియో ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని..ఈ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్య సంరక్షణకు పూర్తిస్థాయి భరోసా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. విద్యార్ధులు తిరిగి స్కూల్స్ కి వస్తే కరోనా వ్యాప్తి వేగం పెరిగే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. దీంతో స్కూల్స్ ప్రారంభాన్ని వాయిదా వేయటమా...లేదంటే దూర విద్య ద్వారా తరగతులు నిర్వహించటమా అనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ అంశంపై  సెప్టెంబర్ 1న స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలాఉంటే..విద్యాసంవత్సర నిర్వహణపై తమ విధానం ఎలా ఉన్నా..కరోనా ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు స్కూల్స్ సంసిద్ధతపై ఫోకస్ చేశామని వివరించారు. కరోనా వ్యాప్తి నివారణకు ఇప్పటికే స్కూల్స్ లో ఏర్పాట్లను ఇప్పటికే పలుమార్లు తనిఖీ చేశామన్నారు. ఒకవేళ విద్యార్ధులు స్కూల్స్ వెళ్లాల్సి వస్తే..భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేసేలా జగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com