బహ్రెయిన్ వెళ్లాలనుకునే ఇండియన్ల కోసం ఫామ్స్ జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- August 17, 2020
బహ్రెయిన్:ఇండియా నుంచి బహ్రెయిన్ వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు ఫామ్ లను భారత రాయబార కార్యాలయం జారీ చేసింది.బహ్రెయిన్ వెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తమ వివరాలను వెల్లడించాలని..https://forms.gle/LvRgihZevKx6SSZ7లింక్ ద్వారా ఫామ్ లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఒక కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్లాలనుకుంటే వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే..ఇది కేవలం బహ్రెయిన్ వెళ్లాలని అనుకుంటున్న ఇండియన్ల సమాచారం సేకరించేందుకు మాత్రమేనని కూడా భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..భారత్-బహ్రెయిన్ మధ్య ప్రస్తుతం ప్రత్యేక విమాన సర్వీసుల నడపటంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని..ఇరు దేశాలు ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోగానే విమాన సర్వీసుల ప్రారంభంపై తమ అధికారిక సోషల్ మీడియాలో వెల్లడిస్తామని రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







