తెలంగాణలో కొత్తగా 1,682 కరోనా కేసులు..
- August 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. నిన్న మరో 8 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 711కి చేరింది. నిన్న ఒక్కరోజే 2070 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 72,202 కు చేరింది. ఇంకా 21,024 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.14,110 మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఇండియాలో కరోనా రికవరీ రేటు 72.51 ఉండగా.. తెలంగాణలో 76.86 గా ఉంది.
నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 235 ,రంగారెడ్డిలో 166, వరంగల్ అర్బన్ 107,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







