హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చోరీ... ట్రోఫీలు మాయం..
- August 18, 2020

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చోరీ జరిగింది. తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయంలో ఉంచిన ట్రోఫీలు మాయమయ్యాయి. కరోనా వల్ల గత నెలలో అసోసియేషన్ కార్యదర్శి జీపీ.. కార్యాలయానికి గత నెల చివర్లో తాళం వేశారు. 20 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు వెళ్లి చూడగా.. తాళం పగులగొట్టి ఉంది. అయితే దొంగలు పడ్డారనే అనుమానంతో లోపలికి వెళ్లి చూస్తే... ఆయనకు ట్రోఫీలు ఉన్న కప్బోర్డు పగులగొట్టి కనిపించింది. అయితే ఆ కప్బోర్డులోని ఒక వెండి, 15 ఇత్తడి ట్రోఫీలు మాయమవ్వడం గమనించిన కార్యదర్శి జీపీ.. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!







