ఐపీఎల్‌ 2020: స్పాన్సర్‌ షిప్‌ టైటిల్‌ గెల్చుకున్న డ్రీమ్ 11

- August 18, 2020 , by Maagulf
ఐపీఎల్‌ 2020: స్పాన్సర్‌ షిప్‌ టైటిల్‌ గెల్చుకున్న డ్రీమ్ 11

ఫాంటరీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ని గెల్చుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు. 222 కోట్ల రూపాయలతో ఈ టైటిల్‌ని డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. ఆగస్ట్‌ 10న బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బిసిసిఐ), స్పాన్సర్‌ షిప్‌ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరిగింది. చైనా - భారత్‌ మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో చైనాకి చెందిన వివో సంస్థ, స్పాన్సర్‌ షిప్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నమెంట్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు యూఏఈ వేదికగా జరగనున్న విషయం విదితమే. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ పోటీలు ఇండియాలో కాకుండా యూఏఈలో నిర్వహిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com