'బ్లాక్ రోజ్' సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మాణం
- August 18, 2020
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం:4గా 'బ్లాక్ రోజ్' సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా..
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ - " మేము నిర్మిస్తున్న 'బ్లాక్ రోజ్' చిత్ర యూనిట్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆగస్ట్ 17 నుండీ నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నాము. రెండు సార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఊర్వశీ రౌతేల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా 'బ్లాక్ రోజ్' కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. కోవిడ్ టైమ్ లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది. చిత్రాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాము." అన్నారు
ఈ చిత్రాన్ని క్రియేట్ చేస్తున్న సంపత్ నంది మాట్లాడుతూ - " షేక్స్ పియర్ రచించిన 'ద మర్చంట్ ఆఫ్ వెనిస్'లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా 'బ్లాక్ రోజ్' తెరకెక్కుతోంది. 'విచక్షణలేని, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం' అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్ ను జోడిస్తూ 'బ్లాక్ రోజ్' ను నిర్మిస్తున్నాం." అన్నారు
ఊర్వశీ రౌతేల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి
రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్,
ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ,
ఎడిటర్: తమ్మిరాజు,
పిఆర్ఓ: బి.ఎ.రాజు,
డిఓపి: సౌందర్ రాజన్,
సంగీతం: మణిశర్మ,
సమర్పణ: పవన్ కుమార్,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
క్రియేటెడ్ బై: సంపత్ నంది,
దర్శకత్వం: మోహన్ భరద్వాజ్.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







