శ్రీశైలం ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
- August 21, 2020
హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని సీఎం కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడిన సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
8,9 హైదరాబాద్‌కు చెందిన అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్
అయితే, ప్రమాద స్థలంలో పొగ తగ్గకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ టీం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. ఆక్సిజన్ అందక వెనక్కి వచ్చారు.. సొరంగంలో దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. సహాయక చర్యలను మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల చిక్కుకున్న సిబ్బందిని కాపాడేందుకు అధికారులు సింగరేణి సహాయం కోరారు. ఇక ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారంతా బాగానే ఉన్నారని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. బాధితులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థకు గురికావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?