GDRFA అనుమతితో యూఏఈలోని ఏ ఎయిర్ పోర్ట్ నుంచైనా చేరుకోవచ్చు

- August 23, 2020 , by Maagulf
GDRFA అనుమతితో యూఏఈలోని ఏ ఎయిర్ పోర్ట్ నుంచైనా చేరుకోవచ్చు

దుబాయ్:విదేశాల్లో చిక్కుకుపోయిన దుబాయ్ రెసిడెన్సీ వీసా దారులు ఇక నుంచి యూఏఈలోని ఏ విమానాశ్రయం నుంచైనా దుబాయ్ చేరుకోవచ్చు. అయితే.. ప్రవాస, విదేశీ వ్యవహారాల శాఖ డైరెక్టరేట్(GDRF) నుంచి ముందస్తు అనుమతి మాత్రం తప్పనిసరి. అలాగే కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి. ఈ మేరకు జీడీఆర్ఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు నేరుగా తమతో కాంటాక్ట్ అయ్యేందుకు వీలుగా #AskDXBOfficial ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రయాణికులకు ఎలాంటి సందేహాలు ఉన్న అడిగి సంబంధిత అధికారుల ద్వారా వివరణ పొందవచ్చని, పారదర్శకంగా ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ఉండేందుకే #AskDXBOfficial ను అందుబాటులోకి తీసుకొచ్చామని దుబాయ్ ప్రభుత్వ మీడియా హౌజ్ ప్రకటించింది. ఇదిలాఉంటే ప్రయాణ పరిమితుల తర్వాత ఉద్యోగాలు కొల్పోయి జరిమానాలు ఎదుర్కుంటున్న వారి పరిస్థితి ఏమిటి అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన జీడీఆర్ఎఫ్ అధికారులు..ఫైన్ బకాయి పడిన వారి విషయంలో ఒక్కో సమస్యను పరిశీలించి మనవతా కోణంలో ఆలోచించి వారి ప్రయాణానికి అనుమతి ఇస్తామని వెల్లడించారు. మరోవైపు ప్రయాణ ఆంక్షల సడలింపుల తర్వాత దుబాయ్ ఎయిర్ పోర్టులో మునుపటి కన్నా 5 శాతం ప్రయాణికుల రద్దీ పెరిగిందని జీడీఆర్ఎఫ్ వివరించింది. 2020 చివరి నాటికల్లా ఈ ఏడాది తొలుతలో ఉన్నట్లుగానే ప్రయాణికుల రద్దీ తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com