పాస్‌పోర్ట్ ఔట్ సోర్స్ సెంటర్‌ని సందర్శించిన భారత రాయబారి
- August 24, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో భారత రాయబారి సిబి జార్జి, జిలీబ్‌లోని పాస్‌పోర్ట్ ఔట్‌సోర్సింగ్ సెంటర్స్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. కమ్యూనిటీ మెంబర్స్‌తో సమావేశమైన ఆయన, అక్కడి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అక్కడ అందుతున్న సేవల్ని పరిశీలించారు. పాస్‌పోర్ట్ సంబంధిత వ్యవహారాలని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గత వారంలో జరిగిన ఓపెన్ హౌస్ మీటింగ్, కమ్యూనిటీ అసోసియేషన్స్ నేపథ్యంలో పాస్‌పోర్ట్ సంబంధిత సమస్యలు కొన్ని తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయబారి శిబి జార్జి, ఆయా అంశాలపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని స్వయంగా హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం పట్ల ఇది ఆహ్వానించదగ్గ ముందడుగు అని శిబి జార్జి పర్యటనపై ఇండియన్ కమ్యూనిటీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







