హిందూపురం కోవిడ్ కేంద్రానికి రూ.55 లక్షలు సాయం అందిస్తున్న నందమూరి బాలకృష్ణ
- August 24, 2020
ప్రముఖ హీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఈనెల 29, 30న తన నియేజకవర్గంలో పర్యటించనున్నారు, ఈ పర్యటనలో హిందూపురం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రంలోని కరోనా రోగులకు, వారికి సేవలు అందిస్తున్న యోధులకు రూ.55 లక్షలు విలువైన పరికరాలు, మందులు,పీపీఈ కిట్లు, మాస్కులు పంపిణిచేయనున్నారు. గతంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బసతారకం ట్రస్ట్ ద్వారా రూ. 25 లక్షల విలువ చేసే రెండు వెంటిలేటర్లు, 100 పీపీఈ యూనిట్లు, మాస్కలు అందజేశారు. అలాగే కరోనాపై పోరాటానికి తన వంతు ఆర్థిక సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలు విరాళంగా అందించారు. అంతే కాకుండా సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీ కి 25 లక్షలు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్న బాలయ్యను అందరూ అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







