కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ
- August 24, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుధీర్ఘ సమయం చర్చలు సాగాయి. పార్టీ సీనియర్లు రాసిన లేఖపైనా చర్చ జరిగింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ సోనియానే కొనసాగాలని కోరిన సీనియర్లు. మన్మోహన్ సింగ్, ఆంటోనీలు సోనియావైపే మొగ్గు చూపుతున్నారు.
కాగా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరో అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు. పార్టీలో సమర్ధవంతమైన నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా అసంతృప్తికి లోనయినట్లు సమాచారం. కాగా మాజీ ప్రధాని మన్మోహన్, మరో సీనియర్ నేత ఏకే ఆంటోనిలు.. సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?