తెలంగాణ:రాజ్ భవన్ లో గణేష్ నిమజ్జనం
- August 24, 2020
హైదరాబాద్:రాజ్ భవన్ చారిత్రక దర్బార్ హాల్ లో గత మూడు రోజులుగా పూజలందుకుంటున్న గణేశుడి విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం నిమజ్జనం చేశారు.
నిమజ్జనానికి ముందు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ఆమె భర్త ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సౌందరరాజన్ తో కలిసి దర్బార్ హాల్ లో వేసిన మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా గవర్నర్ దంపతులు రోజూ ఈ మంటపంలో గణేశునికి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు జరిగిన పూజలో గవర్నర్ దంపతులతో పాటు గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసంధాన అధికారి సి.హెచ్. సీతారాములు, డా. కె. రాజారాం, పోలీసు అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.రాజ్ భవన్ ఆవరణలోని ఫిష్ పాండ్ లో గణేశ నిమజ్జనం చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!