APNRTS అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న వెంకట్

- August 24, 2020 , by Maagulf
APNRTS అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న వెంకట్

కువైట్ సిటీ:అమెరికాలో ఉన్న వ్యాపార లావాదేవీలను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ ఎన్.ఆర్.ఐల గ్లోబల్ కన్వీనర్ గా,వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నత పదవులు అధిష్టించిన APNRTS అధ్యక్షులు గా మేడపాటి వెంకట్ విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు.APNRTS అధ్యక్షులు గా నియమించ బడినప్పటి నుండి ఎన్.ఆర్.ఐల సమస్యల పరిష్కారం కొరకు అనునిత్యం శ్రమిస్తూ, కరోనా విపత్కర పరిస్థితులలో విదేశాలలో ఉన్న వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ముఖ్యంగా, కువైట్ ఆమ్నెస్టీ పై షెల్టర్లలో ఉన్న ఏ.పి వాసులను సురక్షితముగా స్వదేశానికి రప్పించడములో ముఖ్య పాత్ర పోషించారు.ఏడాది కాలం పూర్తి చేసుకున్న సంధర్భంగా APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్ కు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ మీడియా, APNRTS గల్ఫ్ టీం మరియు వై.యస్.ఆర్ పార్టీ అభిమానులు తరపున షేక్ గౌస్ బాషా(APNRTS కువైట్ ప్రొవిజనల్ కో-ఆర్డినేటర్)శుభాకాంక్షలు తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com