కువైట్:ప్రైవేట్ రంగంలో డిపెండెంట్ వీసాలను వర్క్ వీసాలుగా బదిలీ చేయటంపై ఆంక్షలు
- August 25, 2020
కువైట్ సిటీ:ప్రవాసీయుల ఉపాధిపై ప్రభావం చూపే మరో కీలక నిర్ణయం తీసుకుంది కువైట్. ఇక నుంచి ప్రైవేట్ రంగంలో డిపెండెంట్ వీసాలను వర్క్ వీసాలుగా బదిలీ చేయటం కుదరదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే గవర్నమెంట్ కార్మికులను ప్రైవేట్ రంగంలోకి బదిలీ చేయకూడదని తేల్చి చెప్పింది. అయితే..కువైటీ మహిళల భర్తలు, వారి సంతానానికి మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. అంతేకాదు కువైటీయన్లను వివాహం చేసుకున్న మహిళలతో పాటు పాలస్తీనియన్లకు కూడా మినహాయింపు ఇచ్చారు. అయితే..వాళ్లు ట్రావెల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్య శాఖలోని డాక్టర్లు, నర్సులు గుర్తింపు పొందిన సంస్థలకు బదిలీ చేసుకోవచ్చు. కువైట్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో కువైటీ మహిళలను వివాహం చేసుకున్నవారు, వారికి కలిగిన సంతానం, కువైట్, పాలస్తీనాలో జన్మించిన వాళ్లు, కువైట్ విద్యాసంస్థల్లో సెకండరీ స్టేజ్ తో పాటు కనీసం డిప్లోమా చేసిన వాళ్లకి మాత్రమే డిపెడెంట్ వీసాను వర్క్ వీసాగా బదిలీ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







