ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్.
- August 25, 2020
హైదరాబాద్:కోవిడ్ 19 తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే, వాక్సిన్ కోసం అన్ని దేశాలు వెదురుచూస్తున్నాయి, ప్రస్తుతం వాక్సిన్ వచ్చేవరకు కరొనను జయించాలంటే మనిషి రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిందే , ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు ఈ మందులు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వటానికి నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రంలో భాగంగా ఈ రోజు తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఆర్గనైజింగ్ మూర్తి మరియు నందమూరి బాలకృష్ణ కాస్ట్యూమర్ ఏ బి ఆర్ మోహన్ రావు గార్లు కరోనా వ్యాధి నివారణకు హోమియోపతి మరియు యాంటీఆక్సిడాంట్,మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్ క్యాప్సూల్స్ మందులను అందజేశారు.
ఈ సందర్బంగా తెలుగు సినీ స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ జి. శ్రీను మాట్లాడుతూ... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఇచ్చిన మందులు విధిగా మా సభ్యులందరు వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నఅన్నారు.ట్రెజరర్ ఏ వీరభద్రరావు మాట్లాడుతూ... ఈ కార్యక్రంలో పాలుగొన్న ప్రతి వక్కరికి ధన్యవాదాలు అన్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







