తెలంగాణలో కొత్తగా 3,018 కేసులు,10 మరణాలు
- August 26, 2020
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఒకే రోజు మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,018 మంది కరోనా బారిన పడ్డారని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. తాజాగా 10 మంది వైరస్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 780 కి చేరింది. గడచిన 24 గంటల్లో 1,060 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 85,223 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,685 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.92 శాతంగా ఉండగా.. తెలంగాణలో రికవరీ రేటు 76.30 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 10,82,094 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







