రస్ అల్ ఖైమాలో 50 శాతం ట్రాఫిక్ జరీమానా డిస్కౌంట్
- August 27, 2020
యూఏఈ: ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని రస్ అల్ ఖైమా పోలీస్ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రమాదకరమైన రీతిలో వాహనాల్ని నడిపిన కేసుల్లో జరీమానాలకు ఈ డిస్కౌంట్ నుంచి మినహాయింపు వుంటుంది. వాటికి జరీమానా డిస్కౌంట్ వర్తించదు. ట్రాఫిక్ రూల్స్‌ని తప్పక పాటించాల్సిన బాధ్యత పౌరులపై వుంటుందనీ, జరీమానాలు విధించేది కేవలం ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచడం కోసమేనని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. డిస్కౌంట్ని వినియోగించుకునే వాహనదారులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. సమీపంలో వున్న సర్వీస్ సెంటర్ ద్వారా బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ డ్యూ పొందవచ్చు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







