షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- August 28, 2020
షార్జా: ఓ ట్రక్, మరో రెండు వాహనాల్ని ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి గాయాలయ్యాయి. అల్ ధయిద్, షార్జా రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు మరియు ఆరు ఇంటర్‌ఛేంజ్‌ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.20 నిమిషాల సమయంలో షార్జా పోలీస్ ఆపరేషన్ రూమ్ కి ఈ ఘటనపై తొలుత సమాచారం అందింది. వెంటనే ఎమర్జన్సీ క్రూ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఓ ట్రక్ టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న వాహనాల్ని క్లియర్ చేసి, ట్రాఫిక్‌కి అనుమతించారు. వాహనదారులు వాహనాల టైర్ల పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ సూచించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







