ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్ విజేతలకు ఏ.పి గవర్నర్ అభినందనలు
- August 31, 2020
విజయవాడ: తొలి ఆన్‌లైన్ ఫిడే చెస్ ఒలింపియాడ్ ఛాంపియన్‌షిప్‌ను రష్యాతో కలిసి సంయిక్తంగా గెలుచుకున్న భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫిడే ఆన్‌లైన్ ఒలింపియాడ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నందుకు విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవిల్లి హరికా, హరి కృష్ణ, దివ్య, నిహాల్, విదిత్‌లతో కూడిన భారత జట్టుకు గవర్నర్ హరిచందన్ తన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు తేజం కోనేరు హంపి మెరుగైన ఆటతీరును ప్రదర్శించటం తెలుగు వారందరికీ గర్వకారణమని, ఈ విజయం భారతీయులందరినీ గర్వపడేలా చేసిందని గౌరవ గవర్నర్ అన్నారు. భారత జట్టు ప్రదర్శించిన ఆటతీరుతో భారత దేశానికి ఈ గౌరవం దక్కిందని, భవిష్యత్తులో సైతం భారత బృందం మంచి ఆటతీరును ప్రదర్శిస్తూ మరిన్ని విజయాలను కైవశం చేసుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!