డిజిటలైజేషన్ దుబాయ్ లో మరో ముందడుగు..ఆర్టీఏ లో ఈ-సర్టిఫికెషన్ అమలు
- August 31, 2020
రెండేళ్లలో ఆధికార కార్యకలాపాలను డిజిటలైజ్ చేయాలన్న దుబాయ్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరో ముందడుగు పడింది. ఇందులో భాగంగా దుబాయ్ ఆర్టీఏ ఈ-సర్టిఫికెట్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇక నుంచి వాహనాల టెస్టింగ్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లోనే జారీ చేయనున్నట్లు దుబాయ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధారిటీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కోసం వాహనాలను తనిఖీ చేసిన తర్వాత టెస్టింగ్ సర్టిఫికెట్లను ఈ-మెయిల్ చేయనున్నట్లు వెల్లడించింది. దుబాయ్ ఆర్టీఏ ఎల్లప్పుడు దుబాయ్ ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలకు అనుగుణంగా నడుచుకుంటుందని, పేపర్ లెస్ విధానం ద్వారా నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని లైసెన్సింగ్ ఏజెన్సీ డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో పేపర్ వినియోగాన్ని తగ్గించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో కీలకంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఈ-సర్టిఫికెట్ విధానం పట్ల అటు వాహనదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని డైరెక్టర్ అన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!