తనిఖీలు నిర్వహించిన నార్తరన్‌ గవర్నర్‌

- September 02, 2020 , by Maagulf
తనిఖీలు నిర్వహించిన నార్తరన్‌ గవర్నర్‌

బహ్రెయిన్: నార్తరన్‌ గవర్నర్‌ అలి బిన్‌ షేక్‌ అబ్దుల్‌హుస్సేన్‌ అల్‌ అస్‌ఫౌర్‌, గవర్నరేట్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పౌరులకు అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సల్మాబాద్‌ ఇండస్ట్రియల& జోన్‌, బార్బార్‌ అలాగే దిరాజ్‌ గ్రామాల్లో ఆయన పర్యటించారు. డిప్యూటీ నార్తరన్‌ గవర్నర్‌ బ్రిగేడియర్‌ ఖాలిద్‌ బిన్‌ రబియాహ్‌ సినాన్‌ అల్‌ దోస్సారి, పలువురు అధికారులు ఈ పర్యటనలో గవర్నర్‌ వెంట వున్నారు. ఇండస్ట్రియల్‌ మరియు కమర్షియల్‌ ప్రాజెక్టులు అలాగే రోడ్‌ నెట్‌వర్క్‌ వంటి విషయాల గురించీ అడిగి తెలుసుకున్నారు. దిరాజ్‌లో సీవేజ్‌ వాటర్‌ సౌకర్యాలు, ట్రక్కులు అలాగే హెవీ వెహికిల్స్‌కి సంబంధించిన పార్కింగ్‌ లాట్స్‌ వివరాలూ తెలుసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com