జహ్రాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు

- September 02, 2020 , by Maagulf
జహ్రాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు

కువైట్: జహ్రా రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇసుక ట్రక్‌, రెండు కార్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కువైట్‌ దిశగా వెళుతున్న రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జహ్రా గవర్నరేట్‌ బిల్డింగ్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ఫైర్‌ ఫైటింగ్‌ బృందాలు సులైబికత్‌, తాహిర్‌ మరియు జహ్రాల నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com