రిటైర్మెంట్ వీసా ను ప్రవేశపెట్టిన దుబాయ్
- September 03, 2020
దుబాయ్: నివాసితులు లేదా 55 ఏళ్లు పైబడిన ఏ విదేశీయుడైనా ఇప్పుడు ఐదేళ్ల రిటైర్మెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసా కి దరఖాస్తు చేసుకోదలచినవారు http://www.retireindubai.com లో దరఖాస్తు చేసుకోవచ్చు అని సెప్టెంబర్ 2 న ప్రకటించబడింది. దీంతో పదవీ విరమణ పొందివారు తమ కొత్త ఇన్నింగ్స్ ను దుబాయ్‌లో ప్రారంభించవచ్చు.
అయితే ఈ వీసా పొందదలచినవారికి కొన్ని షరతులు వర్తిస్తాయి. అవి, పదవీ విరమణ చేసినవారికి పెట్టుబడుల నుండి లేదా పెన్షన్ల నుండి నెలవారీ 20,000 దిర్హాముల ఆదాయం ఉండాలి; లేదా 1 మిలియన్ దిర్హాముల పొదుపు; లేదా దుబాయ్‌లో 2 మిలియన్ దిర్హాముల విలువైన ఆస్తి ఉండి ఉండాలి.
యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ పథకాన్ని దుబాయ్ టూరిజం మరియు రెసిడెన్సీ మరియు విదేశీయుల వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ ప్రారంభించింది.
దీర్ఘకాలిక నివాస వీసాలు..
2019 లో యూఏఈ దీర్ఘకాలిక నివాస వీసాల విధానాన్ని అమలు చేసింది. ఐదు మరియు 10 సంవత్సరాల వీసా పథకం క్రింద విదేశీయులకు లోకల్ స్పాన్సర్ అవసరం లేకుండా మరియు దేశ ప్రధాన భూభాగంలో వారి వ్యాపారం యొక్క 100 శాతం యాజమాన్యంతో యూఏఈ లో నివసించడానికి, పని చేసేందుకు మరియు విద్యను అభ్యసించేందుకు వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







