ఖష్షోగీ హత్య కేసులో తీర్పుని స్వాగతించిన ఫ్యామిలీ లాయర్
- September 09, 2020
రియాద్:జర్నలిస్ట్ జమాల్ ఖష్షోగి హత్య కేసులో సౌదీ అరేబియన్ కోర్ట్ తీర్పుని, బాధిత కుటుంబం స్వాగతిస్తున్నట్లు ఆ కుటుంబం తరఫు లాయర్ మొతెసామ్ ఖష్షోగి చెప్పారు. 2018లో జమాల్ ఖష్షోగి హత్య జరిగిన విషయం విదితమే. అతి కిరాతకంగా జమాల్ ఖష్షోగిని హత్య చేశారు నిందితులు. నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేయగా, జమాల్ ఖష్షోగి కుటుంబం దోషులకు క్షమాభిక్ష పెట్టింది. దాంతో, మరణ శిక్ష కాస్తా జైలు శిక్షగా మారింది. నిందితుల్లో ఎనిమిది మందికి 7 నుంచి 20 ఏళ్ళ వరకు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఘోరమైన హత్య జరిగిందనీ, ఈ ఘటనకు సంబంధించి దోషులపై శిక్షకు సంబంధించి భారమంతా దేవుడిపైనే వేశామనీ, తమకు న్యాయం చేసేలా సౌదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నమ్మామనీ, అదే ఈ రోజు జరిగిందనీ జమాల్ ఖష్షోగి కుటుంబం అభిప్రాయపడినట్లు లాయర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







