దుబాయ్ లో హైదరాబాదీకి జాక్ పాట్..1 మిలియన్ డాలర్ల లక్కీ లాటరీ కైవసం

- September 09, 2020 , by Maagulf
దుబాయ్ లో హైదరాబాదీకి జాక్ పాట్..1 మిలియన్ డాలర్ల లక్కీ లాటరీ కైవసం

దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ల జాబితాలో మరో భారతీయుడు చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన గ్రంధీ లక్ష్మీ వెంకట తాతా రావ్ ఏకంగా మిలియన్ డాలర్ల లక్కీ డ్రాలో జాక్ పాట్ కొట్టాడు. వెంకట తాతా రావ్ ఏడాదిగా దుబాయ్ లో ఉంటున్నాడు. దుబాయ్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే..అతనికి తరచుగా లాటరీ కొనే అలవాటు ఉన్న వెంటక తాతారావ్ కు ఈ సారి మాత్రం అదృష్టం వరించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ జాక్ పాట్ కొట్టి కొటీశ్వరుడైపోయాడు. బుధవారం నిర్వహించిన డ్రాలో అతను కొన్న లాటరీ నెంబర్ 4829కి మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ తగిలించింది. ఈ విషయం తెల్సుకున్న గ్రంధీ లక్ష్మీ వెంకట తాతా రావ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రైజ్ మనీలో ఎక్కువ భాగాన్ని తన కుటుంబ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా వినియోగిస్తానని తెలిపారు. తన పాప భవిష్యత్తుపై ఇక ఏ చింత లేదని అంటున్నారు. అంతేకాదు..హైదరాబాద్ లో ఉన్న తన భార్యను ఇక దుబాయ్ తీసుకొస్తానని చెబుతున్నారు. ఇదిలాఉంటే 1999లో దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలీనియనీర్ల ప్రమోషన్ ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా ప్రవాస భారతీయులే జాక్ పాట్ కొట్టారు. ప్రస్తుతం డీడీఎఫ్ మిలీనియమ్ మిలీనియర్ డ్రా గెలుచుకున్న గ్రంధి లక్ష్మీ వెంకట తాతా రావ్...జాక్ పాట్ కొట్టిన 168వ భారతీయుడు కావటం విశేషం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com