మస్కట్: ఒమన్ లో కొత్తగా 349 కోవిడ్ కేసులు..మరో 9 మంది మృతి

- September 09, 2020 , by Maagulf
మస్కట్: ఒమన్ లో కొత్తగా 349 కోవిడ్ కేసులు..మరో 9 మంది మృతి

ఒమన్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. సుల్తానేట్ లో కొత్తగా మరో 349 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఒమన్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 87,939 మందికి చేరింది. ఇక వైరస్ సోకి మరో 9 మంది మృతి చెందారు. సుల్తానేట్ పరిధిలో ఇప్పటివరకు 751 మంది కరోనాతో మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే..వైరస్ తీవ్రతతో పాటు..కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లోనే 142 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ నుంచి కొలుకున్న వారి సంఖ్య 83,115కి చేరింది. ఇదిలాఉంటే..వైరస్ రికవరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా..కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలంతా అప్రమత్తతో వ్యవహరించాలని అధికారులు సూచించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకూడదని పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com