వాహనాల స్వాధీనానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన అబుధాబి పోలీసులు

- September 10, 2020 , by Maagulf
వాహనాల స్వాధీనానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన అబుధాబి పోలీసులు

అబుధాబి:నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేసే వారి వాహనాల స్వాధీనానికి సంబంధించి అబుధాబి పోలీసులు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేశారు. కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం ఎవరైన వాహనదారుడు పోలీసుల వాహనాలను ఢీకొన్నా..పోలీస్ వాహనాల డ్యామేజ్ కి కారణమైనా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు డ్రైవర్ కి 50 వేల దిర్హామ్ ల జరిమానా  విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా రేసింగ్ లలో పాల్గొన్నా, సరైన నెంబర్ ప్లేట్ లేకున్నా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు 50 వేల దిర్హామ్ ల జరిమానా విధించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగంగా నడిపి ప్రమాదాలకు కారణమైనా, రోడ్ క్రాసింగ్ కు నిర్దేశించిన ప్రాంతాల్లో పాదాచారులకు దారి ఇవ్వకున్నా  డ్రైవర్ కు 5,000 దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను ముందు సీటులో కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేసినా 5,000 దిర్హామ్ ల ఫైన్ విధిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com