జీ20, కోవిడ్ 19 అంశాలపై ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు, భారత ప్రధాని

- September 10, 2020 , by Maagulf
జీ20, కోవిడ్ 19 అంశాలపై ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు, భారత ప్రధాని

రియాద్:సౌదీ అరేబియా రాజు సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో గత బుధవారం జీ20 సదస్సు, కరోనా మహమ్మారి అరికట్టే చర్యలపై ఫోన్ లో చర్చించారు. నవంబర్ సౌదీ వేదికగా జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన రాజు సల్మాన్..పలు సవాళ్లపై జీ20 సభ్య దేశాల పని తీరుపై చర్చించుకున్నారు. అలాగే కరోనా మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లు, వైరస్ ప్రభావాన్ని తగ్గించే మార్గాలకు సంబంధించి డిస్కస్ చేసుకున్నారు. జీ20 సభ్య దేశాలు కరోనా వైరస్ పై పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని సౌదీ రాజు సల్మాన్ గుర్తు చేశారు. ప్రపంచ అర్ధిక గమనానికి దోహదం చేసేలా మహమ్మారిని నియంత్రించాల్సిన ప్రధాన్యతను మోదీతో పంచుకున్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది జీ 20 సదస్సుకు విశిష్ట నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. జీ20 సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు మేలు జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఇరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణల సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాల అభివృద్ధి ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com