దుబాయ్ హాలా టాక్సీలో నిబంధనల సడలింపు..ఇక నుంచి నలుగురికి అనుమతి

- September 10, 2020 , by Maagulf
దుబాయ్ హాలా టాక్సీలో నిబంధనల సడలింపు..ఇక నుంచి నలుగురికి అనుమతి

దుబాయ్:కోవిడ్ నేపధ్యంలో దుబాయ్ టాక్సీల్లో విధించిన ఆంక్షలను పాక్షికంగా సడలించారు. రోడ్డు రావాణా అధికారుల ప్రకటించిన కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం ఇక నుంచి టాక్సీలో నలుగురు ప్రయాణించొచ్చు. అయితే..ఈ సడలింపు కేవలం హాలా టాక్సీలకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన టాక్సీల్లో మాత్రం ఇప్పటివరకు అమల్లో ఉన్న ఇద్దరు ప్రయాణికుల నిబంధనలే అమలవుతాయి. హాలా టాక్సీలో ఇద్దరిద్దరు కూర్చునేలా రెండు వరుసల సీటింగ్ ఉంటుంది. దీంతో ప్రయాణికుల భౌతిక దూరానికి ఎలాంటి అవరోధం కలగదు. ఈ నేపథ్యంలోనే హాలా టాక్సీలలో నలుగురు ప్రయాణించేందుకు దుబాయ్ రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు..ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ వీధుల్లో పరిమిత సంఖ్యలోనే టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రజా రవాణాకు అసౌకర్యం కలుగుతోంది. ఈ నేపథ్యంలో హాలా ట్యాక్సీలలో నలుగురు ప్రయాణికులకు అనుమతివ్వటం కొద్దిమేర ఊరటనిచ్చే అంశం. పైగా ఇతర టాక్సీల ఛార్జీలతో పోలిస్తే హాలా కూడా దాదాపు సమాన ఛార్జీలను వసూలు చేస్తోంది. అంతేకాదు ఇతర టాక్సీలతో పోలిస్తే హాలా టాక్సీల్లో ప్రయాణం సులభం, సురక్షితమన్నది అధికారుల భావన. కరీమ్ యాప్ ద్వారా టాక్సీ ఎక్కే ప్రదేశం, గమ్యస్థానం చిరునామాను పేర్కొని ఏ తరహా ట్యాక్సీ కావాలో బుక్ చేసుకోవచ్చు. వెయిటింగ్ సమయంతో సహా టాక్సీ చార్జీ అంతా పారాదర్శకంగా ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com