మండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌

- September 14, 2020 , by Maagulf
మండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్:మండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌.నూతన రెవెన్యూ చట్టం ఆవశ్యకతను వివరించారు. భూమి ప్రధాన ఉత్పత్తి సాధనమని అన్నారు.ఈ సందర్భంగా రెవెన్యూ చట్టాలు, సంస్కరణల చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అసఫ్‌జాహీల కాలంలో పని చేసిన ముగ్గురు సాలర్‌జంగ్‌లు అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు.1985లో పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దయిందని చెప్పారు. 2007లో వీఆర్‌వో వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎకరం భూమి 10 లక్షలకు తక్కువ లేదని, కొన్ని చోట్ల ఎకరం భూమి కోటి రూపాయలు కూడా ఉందని తెలిపారు. రేట్లు పెరగడంతో మాఫియా పెరిగే ప్రమాదముందని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం అవసరాన్ని వివరిస్తూ.. చర్చను ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com