కువైట్:సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారికి పొడిగింపు లేదు
- September 15, 2020
కువైట్ సిటీ: కువైట్ లో కువైట్ ప్రభుత్వం మార్చిలో రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారికి మహమ్మారి కరోనా నేపథ్యంలో నవంబర్ చివరి వరకు గ్రేస్ పిరీయడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ వల్ల ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంచడంతో పొడిగింపు చేసుకోలేకపోయారనే కారణంతో వీరికి నవంబర్ వరకు పొడిగింపు ఇవ్వడం జరిగింది.అయితే, ఈ పొడిగింపు సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారికి వర్తించదని తాజాగా కువైట్ ప్రభుత్వం వెల్లడించింది.ఒకవేళ సెప్టెంబర్ 1 తర్వాత రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారు పొడిగింపు చేసుకోకుంటే రోజుకి 2 కువైట్ దినార్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.రెసిడెన్సీ వ్యవహారాల శాఖ వారు జూన్ చివరి నుంచే వీసా పునరుద్ధరణ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు కనుక సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారు తమ వీసాలను పునరుద్ధరించుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!