హైదరాబాద్‌లోని DRDOలో ఉద్యోగావకాశాలు
- September 15, 2020
హైదరాబాద్:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్-RCI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ హైదరాబాద్‌లో ఉంది. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4 ఖాళీలున్నాయి. అవసరాన్ని బట్టి నియామక ప్రక్రియ పూర్తయ్యేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఇవి రెండేళ్ల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఎంపికైన వారికి రూ.54,000 స్టైపెండ్ లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 22 చివరి తేదీ. అభ్యర్థులకు సెప్టెంబర్ 28న ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rcilab.in/వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







