కరోనా ఫ్రంట్ లైనర్స్ కి 2 నెలల జీతం, మెడల్ ప్రకటించిన కువైట్

- September 17, 2020 , by Maagulf
కరోనా ఫ్రంట్ లైనర్స్ కి 2 నెలల జీతం, మెడల్ ప్రకటించిన కువైట్

కువైట్ సిటీ:కరోనా మహమ్మారి ప్రబలుతున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రణాలను రిస్క్ చేసి విధులు నిర్వహించిన కరోనా ఫ్రంట్ లైనర్స్ ప్రొత్సహాకాలు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. కువైట్ లోని అన్ని సెక్యూరిటీ విభాగాల ఉద్యోగులకు 2 నెలల జీతంతో మెడల్ ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమర్ధవంతంగా అమలు చేయటంలో కీలక పాత్ర పోషించిన ఫ్రంట్ లైనర్స్ సేవలను గుర్తించటం తమ బాధ్యతగా భావిస్తున్నామని అంతర్గత వ్యవహారల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తన ప్రకటన వెల్లడించారు. కువైట్ ఆర్మీ, కువైట్ పోలీస్, నేషనల్ గార్డ్, కువైట్ ఫైర్ సర్వీస్ విభాగాల ఉద్యోగులు ప్రభుత్వ ప్రకటించిన ప్రొత్సహకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అయితే...కరోనా సమయంలో సేవలు అందించిన తమ సిబ్బందికి మూడు నెలల జీతం ఇవ్వాలని అన్ని భద్రత విభాగాల అధిపతులు తొలుత కోరాయి. మెడల్ ద్వారా లభించే అలవెన్సులు అవసరం లేదని ప్రతిపాదించాయి. కానీ,  మంత్రిత్వ శాఖ భద్రత సిబ్బందికి మెడల్ ఇచ్చేందుకే మొగ్గు చూపింది. దీంతో ఆయా భద్రతా విభాగాల్లోని సిబ్బందికి రెండు నెలల పూర్తి వేతనం(ఎలాంటి కోతలు లేకుండా) నెలకు 75KD మెడల్ అలవెన్స్ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com