'అహం' లో విలన్‌గా రాజశేఖర్

- February 10, 2016 , by Maagulf
'అహం' లో విలన్‌గా రాజశేఖర్

'యాంగ్రీ యంగ్‌మ్యాన్' పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్ ఇప్పుడు పూర్తిస్థాయి విలన్‌గా కనిపించను న్నారు. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. 'నువ్వు-నేను', 'జయం' లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన తేజ దర్శకత్వంలో త్వరలో 'అహం' పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో విలన్‌గా రాజశేఖర్ నటించనున్నారు. తేజ చెప్పిన స్క్రిప్ట్‌కు ఇంప్రెసైన రాజశేఖర్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో ఓ యంగ్ హీరో చేయనున్నారు. రాజశేఖర్‌కు జోడీగా ప్రముఖ కథానాయికను ఎంపిక చేయనున్నారు.ఇటీవలి కాలంలో హీరో జగపతిబాబు కూడా విలన్‌గా మారి, వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో రాజశేఖర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడంపై తెలుగు సినీ సీమలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.రాజశేఖర్ తన కెరీర్ తొలినాళ్ళలో 'తలంబ్రాలు' చిత్రంలో నెగిటివ్ రోల్ చేశారు. 'అహం'లో రాజశేఖర్ పాత్రను విభిన్నంగా ఆవిష్కరించడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలియనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com