నిరుద్యోగ యువతకు గాలం వేసిన ముఠాని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీస్
- September 19, 2020
హైదరాబాద్:AMC కంపెనీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వందల సంఖ్యలో బాధితులున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని... జనాలను ముఠా సభ్యులు మభ్యపెట్టారు. దీనికోసం ముందుగా నిరుద్యోగ యువతకు గాలం వేసి రిక్రూట్‌మెంట్ చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి యూపీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి 50 వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. లక్నో కేంద్రంగా జాబ్ ఫ్రాడ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నౌకరీ వెబ్‌సైట్ నుంచి రెజ్యూమ్‌లను తీసుకుని.. కెరీర్ స్టైల్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. అలా హైదరాబాద్ యువతకు గాలం వేశారని సీపీ సజ్జనార్ తెలిపారు.



తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







