సెంట్రల్‌ దోహా - ఫేజ్‌ 4 రోడ్స్‌ డెవలప్‌మెంట్‌ కాన్సెప్ట్‌ రెడీ

సెంట్రల్‌ దోహా - ఫేజ్‌ 4 రోడ్స్‌ డెవలప్‌మెంట్‌ కాన్సెప్ట్‌ రెడీ

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, సెంట్రల్‌ దోహాలోని ఫేజ్‌ 4 మెయిన్‌ రోడ్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌ డిజైన్‌ని పూర్తి చేయడం జరిగింది. కొత్త అండర్‌ పాస్‌లు, ఓవర్‌హెడ్‌ బ్రిడ్జిలు వంటి అంశాలతో కూడిన ప్రాజెక్ట్‌ని పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ (అష్గల్‌)కి పంపడం జరిగింది. డి రింగ్‌ రోడ్‌ (అల్‌ నజ్మా), సి రింగ్‌ రోడ్‌ (అల్‌ జహ్రా), దోహా ఎక్స్‌ప్రెస్‌ వే (హలౌల్‌), డి రింగ్‌ రోడ్‌ (రావ్‌దత్‌ అల్‌ ఖయిల్‌) వంటి చోట్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా. ఎంఓటీసీ సూచనలకు అనుగుణంగా అష్గల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుల్ని దేశవ్యాప్తంగా చేపడుతోంది. 

 

Back to Top