ECILలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు..
- September 21, 2020
హైదరాబాద్:ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) హైదరాబాద్ 17 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకుhttp://http://careers.ecil.co.in/వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
మొత్తం ఖాళీలు -17 హైదరాబాద్ -9, దుర్గాపూర్ -2, కొచ్చిన్ -1, ముంద్రా-1, ముంబై -2, చండీగఢ్ -1, చెన్నై -1 విద్యార్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ లేదా బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. జీతం: నెలకు రూ.23 వేలు దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 18, 2020, చివరి తేదీ: సెప్టెంబర్ 30,2020.. వయస్సు: 2020 ఆగస్ట్ 31 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ బీఈ లేదా బీటెక్ లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యుకు పిలుస్తారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









