కోవిడ్ 19 క్లినికల్ ట్రయల్స్ లో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమవుతున్న సౌదీ
- September 23, 2020
సౌదీ అరేబియా:కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధిలో సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కాబోతోంది. వ్యాక్సిన్ అభివృధ్ధి చేస్తున్న పలు చైనా కంపెనీలతో కలిసి కోవిడ్ పై వ్యాక్సిన్ ప్రభావ తీరును పరిశీలించనుంది. సౌదీలోని కింగ్ అబ్ధుల్లా అంతర్జాతీయ వైద్య పరిశోధన కేంద్రంలో ఒకరిద్దరు కోవిడ్ పేషంట్లపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు తయారు చేసిన 40 రకాల వ్యాక్సిన్లను కోవిడ్ పేషెంట్లపై ప్రయోగించారు. ఇందులో 9 రకాల వ్యాక్సిన్లు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించుకునేందుకు అవసరమైన వ్యాక్సిన్ ప్రయోగాల్లో తాము కూడా భాగస్వామ్యం అవుతామని సంసిద్ధత వ్యక్తం చేసిన సౌదీ కేంద్ర ప్రభుత్వం..కేంద్ర ఆరోగ్య శాఖతో పాటు అహారం, ఔషధ నియంత్రణ అధికార విభాగం సహాకారంతో తమ దేశంలో క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు సుముఖంగా ఉంది. ప్రస్తుతం మూడో దశలో ఉన్న 9 రకాల వ్యాక్సిన్లలో ఒకటి లేదా రెండు రకాలను తమ కింగ్డమ్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం







