ఎంట్రీ పర్మిట్స్‌ని పునఃప్రారంభించిన యూఏఈ

- September 24, 2020 , by Maagulf
ఎంట్రీ పర్మిట్స్‌ని పునఃప్రారంభించిన యూఏఈ

యూఏఈ:యూఏఈ, ఎంట్రీ పర్మిట్స్‌ని సెప్టెంబర్‌ 24 నుంచి పునఃప్రారంభించింది. అయితే, వర్క్‌ పర్మిట్స్‌కి దీన్నుంచి మినహాయించారు. ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌ (ఎఫ్‌ఎఐసి) ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నుంచి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ఎంట్రీ పర్మిట్స్‌ ప్రక్రియను పునఃప్రారంభించినట్లు పేర్కొంది. కోవిడ్‌ 19 నిబంధనలు కొనసాగిస్తూనే, టూరిస్టులను ఆకర్షించడం, ఎకనమిక్‌ యాక్టివిటీస్‌ని పెంచడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com