" ఉత్పాదక గృహ " ప్రదర్శన ప్రారంభం
- February 11, 2016
బహెరిన్ కు చెందిన 50 కుటుంబాల భాగస్వామ్యంలో ఉత్పాదక గృహ ప్రదర్శనను షైఖ మౌనిర బింట్ హమీద్ బిన్ ఇస అల్ ఖలీఫా ప్రారంబించారు. తూర్పు రిఫ్ఫా లోని అల్ అవధి యువజన, బాలల క్లబ్ లో తొలిసారిగా కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఈ ఉత్పాదక గృహన్ని మొదలయ్యింది. తొలుత సంభందిత మంత్రి జమిల్ బిన్ మొహమద్ అలీ హుమైదేన్,ఉన్నతాధికారులు రాజుసతి షైఖ మౌనిర బింట్ హమీద్ బిన్ ఇస అల్ ఖలీఫాను సాదరంగా ఆహ్వానించారు. ఆమె రిబ్బన్ లాంచనంగా కత్తిరించి ఈ ఉత్పాదక గృహ ప్రదర్శనను అధికారకంగా ప్రారంబించారు. బహెరిన్ సాంప్రదాయాలు ఉట్టిపడే కళాఖండాలను , సృజనాత్మకతను ప్రతిబింబించే పలు చిత్రాలను ఇక్కడ ఉంచారు. వీటిని రూపొందించిన కళాకారులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు, ఈ ఉత్పతులను మరింతగా అభివృద్ధి చేయాలంటే , ఏ విధమైన చర్యలు చేపట్టాలో 50 కుటుంబాల వారితో ముచ్చటించారు. ప్రచారం , మార్కెటింగ్ అవకాశాలను పెంచడం ద్వారా " ఉత్పాదక గృహ " ప్రదర్శనను మరింతగా ప్రజల్లోనికి తీసుకొనివెళ్ళడం మంచిదని ఈ సందర్భంగా రాజుసతి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









