విమాన సర్వీసుల నిషేధం ఉన్న ఆ 32 దేశాల నుంచి ఛార్టెడ్ ఫ్లైట్స్ అనుమతిచ్చిన కువైట్
- September 27, 2020కువైట్ సిటీ:అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కువైట్ ప్రభుత్వం. అన్ని దేశాల నుంచి విమానాలకు అనుమతి ఇచ్చినా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 32 దేశాల నుంచి మాత్రం విమానాల రాకపోకలను నిషేధించింది. అయితే..ఆ 32 దేశాల నుంచి కూడా ముందస్తు అనుమతులతో ఛార్టెర్డ్ ఫ్లైట్స్ ను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కువైట్ లో పలు ప్రభుత్వ విభాగాల్లో ప్రవాస కార్మికులను సమకూర్చుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించింది. అంతేకాదు..పది కేటగిరిలలో ప్రవాస ఉద్యోగులు, కార్మికులను నియమించుకునేందుకు ఆమోదం తెలిపిన కువైట్..పలు దేశాల నుంచి కార్మికులను తీసుకువచ్చేందుకు వీలుగా ఆ 32 దేశాల నుంచి కూడా ఎట్టకేలకు ప్రత్యేక విమానాల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. అయితే..ప్రత్యేక విమానానికి ముందుగానే ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా ప్రభుత్వ విభాగాలు తమ దగ్గర పనికి కుదిరే సదరు ప్రవాస కార్మికుల పేర్లు, ఏ విధులు నిర్వహిస్తున్న వివరాలను ముందుగా కరోనా నియంత్రణ కమిటీకి సమర్పించి వారి నుంచి నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష