ప్రభుత్వోద్యోగాల వైపే ఎమిరాతిల మొగ్గు

- February 11, 2016 , by Maagulf
ప్రభుత్వోద్యోగాల వైపే ఎమిరాతిల మొగ్గు

ప్రైవేటు ఉద్యోగాలతో పోల్చితే ప్రభుత్వ ఉద్యోగాల వైపే ఎమిరేటీ యువత మొగ్గు చూపుతోంది. ప్రభుత్వ సెక్టార్‌లో అధిక జీతం, లైఫ్‌కి సెక్యూరిటీ వంటి అంశాలు యువత, ప్రైవేటు ఉద్యోగాలకన్నా ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి సారించడానికి కారణంగా తెలియవస్తోంది. ప్రైవేట్‌ సెక్టార్‌లో 60,000 ఉద్యోగాలు ఉండగా, అందులో 10 శాతం మాత్రమే ఎమిరేటీ యువత ఉన్నారనీ, ఎక్కువమంది ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా కెరీర్‌లో ముందుకు వెళుతున్నారని వివిధ నివేదికలు వెల్లడించాయి. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాననీ, ఇదే తన జాతికి తాను చేసే సేవ అని 16 ఏళ్ళ అహ్మద్‌ హుస్సేన్‌ అహ్మద్‌ చెప్పారు. 18వ జాతీయ కెరీర్‌ ఎగ్జిబిషన్‌ని సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌, షార్జా రూలర్‌ షేక్‌ సుల్తాన్‌ మొహమ్మద్‌ అల్‌ ఖాసిమి ఎక్స్‌పో సెంటర్‌, షార్జా వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా ఎమిరేటీ యువతకు ఎక్కువ స్థానం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎగ్జిబిషన్స్‌ కెరీర్‌ పట్ల యువత దృక్పథాన్ని మార్చుతాయని అన్నారు. ప్రతి సంవత్సరం 15 వేల మంది యువత ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉద్యోగాలు పొందుతున్నారని నిపుణులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com