ప్రధాని మోదీపై WHO ప్రశంసలు
- September 27, 2020
జెనీవా:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం జరిగిన 75వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంలో భారత్ కృషి చేస్తుందని అన్నారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై టెడ్రోస్ ఆయనను ట్విట్టర్ వేదికగా అభినందించారు. కరోనా పోరాటంలో ప్రపంచ దేశాలకు మద్దతుగా నిలుస్తున్న మోదీకి ధన్యవాదాలని టెడ్రోస్ తెలిపారు. కరోనా కాలంలో భారత్ ప్రపంచ దేశానికి మందులు సరఫరా చేసినా విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాగే కలసికట్టుగా ఉండి సహకారం అందించుకోవాలని, అప్పుడే కరోనా వైరస్ను అంతమొందించగలమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..