పిసిఆర్‌ టెస్ట్‌ సర్టిఫికెట్‌ సర్వీస్‌ కోసం ‘బి అవేర్‌ యాప్‌’

- September 29, 2020 , by Maagulf
పిసిఆర్‌ టెస్ట్‌ సర్టిఫికెట్‌ సర్వీస్‌ కోసం ‘బి అవేర్‌ యాప్‌’

మనామా:ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ఇ-గవర్నమెంట్‌ అథారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మొహమ్మద్‌ అలీ అల్‌ ఖయీద్‌ ‘బి అవేర్‌ బహ్రెయిన్‌’ యాప్‌ ద్వారా రియల్‌ టైవ్‌ు పాలమరైజ్‌ ఛైన్‌ రియాక్షన్‌ (పిసిఆర్‌) టెస్ట్‌ సర్టిఫికెట్‌ని ట్రావెలర్స్‌కి అందించడం జరుగుతుందని ప్రకటించారు. విదేశాలకు వెళ్ళే వారికి ఈ సర్టిఫికెట్‌ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. లేటెస్ట్‌ యాప్‌ అప్‌డేట్‌లో దీన్ని పొందుపరిచారు. స్పెషలిస్ట్‌ ఎన్‌టైటీస్‌ ద్వారా ఈ సర్టిఫికెట్‌ జారీ చేయడం జరుగుతుంది. పిసిఆర్‌ టెస్ట్‌ అనేది అత్యంత ప్రమాణికమైనది కరోనా వైరస్‌కి సంబంధించి. ప్రింట్‌ పిడిఎఫ్‌ ఆప్షన్‌, క్యు ఆర్‌ కోడ్‌ వంటి వెసులుబాట్లు కూడా ఈ యాప్‌లో పొందుపరిచారు. ఎంట్రీ పాయింట్స్‌ వద్ద ఈ సర్టిఫికెట్‌ని యాప్‌ ద్వారా చూపిస్తే సరిపోతుంది. అవసరమైతే ప్రింట్‌ తీసుకోవడానికి కూడా వీలుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com