'పీఎన్బీ'లో ఉద్యోగాలు
- October 01, 2020
భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులు రిస్క్, క్రెడిట్, ట్రెజరీ, లా, ఆర్కిటెక్ట్, సివిల్, ఎకనామిక్, హెచ్ఆర్ విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 29 తోనే ముగిసినప్పటికీ తాజాగా ఆ గడువును అక్టోబర్ 6 వరకు పొడిగించారు. మొత్తం ఖాళీలు: 535
మేనేజర్ రిస్క్-160 మేనేజర్ క్రెడిట్ - 200 మేనేజర్ ట్రెజరీ - 30 మేనేజర్ లా - 25 మేనేజర్ సివిల్ - 08 మేనేజర్ ఎకనామిక్ - 10 సీనియర్ మేనేజర్ రిస్క్ - 40 సీనియర్ మేనేజర్ క్రెడిట్ - 50 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, సీఏ/ ఐసీడబ్ల్యుఏ/ఎంబీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట అనుభవం ఉండాలి. వయసు: పోస్టులను బట్టి 25-37 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 08,2020 దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 06,2020 దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175, మిగిలిన వారికి రూ.850 ఆన్లైన్ పరీక్ష తేదీ : అక్టోబర్/నవంబర్ వెబ్సైట్: https://www.pnbindia.in/
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!