రోడ్లపై వదిలేసిన కార్లను తొలిగిస్తున్న మస్కట్ మున్సిపాలిటి
- October 08, 2020
మస్కట్:కొన్నాళ్లుగా రోడ్లపై వదిలేసిన కార్లను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తోంది మస్కట్ మున్సిపాలిటి. ప్రస్తుతం ఘాల ఇండస్ట్రీయల్ జోన్ లో చాలా కాలంగా పట్టించుకోకుండా వదిలేసిన వాహనాలను అక్కడి నుంచి తరలిస్తున్నట్లు మున్సిపాలిటి అధికారులు తెలిపారు. రోడ్ల పక్కన, ఇండస్ట్రీయల్ ప్రాంతాల్లో వాహన యజమానులు తమ కార్లను పార్క్ చేసి వాటిని పట్టించుకోకుండా నెలల తరబడి వదిలివేస్తున్న విషయం తెలిసిందే. అవి దుమ్ము కొట్టికుపోయి నగర పరిశుభ్రతకు ఆటంకం కలిగించటమే కాకుండా..చోరీ ఘటనలకు ఆస్కారంగా మారుతున్నాయి. దీంతో మస్కట్ మున్సిపాలిటీ అధికారులు రోడ్ల పక్కన, ఇండస్ట్రీయల్ జోన్లలో వదిలేసిన కార్లను వెంటనే తొలగించాలని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించారు. కొందరు వాహనదారులు పట్టించుకోకపోవటంతో మున్సిపాలిటీ అధికారులు ఆ వాహనాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగానే ఘాలా పారిశ్రామిక వాడలోని కార్లను స్వాధీనం చేసుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!