భారత్ లో కరోనా విజృంభణ...
- October 11, 2020
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. రోజువారి కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉంది... తాజా కేసులతో కలుపుకొని 70 లక్షల మార్క్‌ను కూడా క్రాస్ చేశాయి పాజిటివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,383 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 918 మంది మృతిచెందారు.. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 70,53,807కు చేరుకోగా.. ఇప్పటి వరకు 60,77,977 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 8,67,496 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1,08,334 మంది మృతిచెందినట్టు తన బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. కరోనా రోగుల రికవరీ రేటు 86.17 శాతానికి పెరగగా.. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.30 శాతంగా ఉన్నాయి.. ఇక, మరణాల రేటు 1.54 శాతానికి తగ్గినట్టు కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







